News April 7, 2025
కామారెడ్డి: ప్రజావాణిలో 73 ఫిర్యాదులు

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన 73 దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూముల సమస్యలు, రెండు పడకగదుల ఇళ్లు, రైతు భరోసా, పింఛన్లు వంటి అంశాలపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
Similar News
News April 19, 2025
కాజీపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేటలోని దర్గా ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ అర్చనకు 2022లో వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆమెకు భర్తతో విడాకులు కావడంతో మానసికంగా బాధపడింది. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడింది.

గద్వాల్: భూభారతితో రైతులకు భద్రత: పొంగులేటి

భూభారతి 2025 చట్టం రైతులకు మరింత భద్రత కల్పిస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గద్వాల్ జిల్లా ధరూర్ తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో భూభారతి చట్టంపై నిర్వహించిన సదస్సుకు మంత్రి హాజరై, మాట్లాడారు. గతంలో ధరణి వల్ల రైతులు ఇబ్బంది పడ్డారని, వాటిని తొలగించేందుకు ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చిందన్నారు. రైతు సమస్యలు తొలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.