News January 31, 2025

కామారెడ్డి: ప్రాక్టికల్ పరీక్షలను పరిశీలించిన నోడల్ అధికారి

image

కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేఖ్ సలాం శుక్రవారం బాన్సువాడ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలను పరిశీలించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధ్యాపకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అసద్ ఫారుఖ్, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News October 25, 2025

US, EU ఆంక్షలను పాటిస్తాం: రిలయన్స్

image

రష్యా చమురు కంపెనీలపై అమెరికా, ఈయూ ఆంక్షలను పాటిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. వాటి మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని, ఆంక్షల ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని వెల్లడించింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా రష్యాలోని అతిపెద్ద చమురు కంపెనీలు రాస్‌నెఫ్ట్, లాకాయిల్‌పై అమెరికా, ఈయూ ఆంక్షలు విధించాయి. ఆ రెండు సంస్థలతో వ్యాపారాన్ని నవంబర్ 21 నాటికి ముగించాలని రిఫైనరీలను ఆదేశించాయి.

News October 25, 2025

కొడిమ్యాల: ‘ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలి’

image

ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత అన్నారు. కొడిమ్యాల తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. గ్రామ పాలన అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలన్నారు. సండ్రళ్లపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని లత సందర్శించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

News October 25, 2025

సంగారెడ్డి: రేపు జిల్లా పోలీస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం

image

జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్‌లో రేపు(శనివారం) ఉదయం 8 గంటలకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఈరోజు తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్తం దానం చేయాలనుకునే వారు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి, ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు.