News March 27, 2025
కామారెడ్డి: ప్రైవేటు ఆసుపత్రి ముసివేయాలని హైకోర్టు నోటీసులు

కామారెడ్డిలోని సమన్విత హాస్పిటల్లో అక్రమ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ, గర్భవిచ్చితి, శిశువిక్రయాలు వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. హైకోర్టు ఆదేశాలతో ఆసుపత్రిని మూసివేయాలని నిర్ణయం తీసుకొని నోటీసులు అందజేశారు. ఆసుపత్రి యాజమాన్యం నిరాకరించడంతో హైకోర్టు ఉత్తర్వులను ఆసుపత్రి గేట్లకు అతికించారు. ఈ విషయాన్ని డీఎంహెచ్వో చంద్రశేఖర్ తెలిపారు.
Similar News
News September 16, 2025
సిరిసిల్ల: ‘బోర్డు జీవో 12ను ప్రభుత్వం వెంటనే సవరించాలి’

భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు జీవో 12ను వెంటనే సవరించాలని బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ అన్నారు. సిరిసిల్లలోని శివనగర్ లో సిఐటియు ఆధ్వర్యంలో బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ 3వ మహాసభలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. నిర్మాణరంగంలో పనిచేస్తున్న కార్మికులు దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారని వివరించారు.
News September 16, 2025
నిజామాబాద్: ఈ నెల 17 నుంచి పోషణ మాసం

పిల్లల పెరుగుదలకు, పోషణ లోపం తగ్గించుట, బరువు లోపం లేకుండా పోషక ఆహారాలను అందించుటలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోషణ మాసం కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి, అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
News September 16, 2025
రానున్న 2-3 గంటల్లో వర్షం.. భారీగా ఈదురు గాలులు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కరీంనగర్, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురవొచ్చని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.