News March 27, 2025
కామారెడ్డి: ప్రైవేటు ఆసుపత్రి ముసివేయాలని హైకోర్టు నోటీసులు

కామారెడ్డిలోని సమన్విత హాస్పిటల్‌లో అక్రమ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ, గర్భవిచ్చితి, శిశువిక్రయాలు వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. హైకోర్టు ఆదేశాలతో ఆసుపత్రిని మూసివేయాలని నిర్ణయం తీసుకొని నోటీసులు అందజేశారు. ఆసుపత్రి యాజమాన్యం నిరాకరించడంతో హైకోర్టు ఉత్తర్వులను ఆసుపత్రి గేట్లకు అతికించారు. ఈ విషయాన్ని డీఎంహెచ్వో చంద్రశేఖర్ తెలిపారు.
Similar News
News April 24, 2025
గద్వాల: ‘అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’

జిల్లాకు అవసరమైన వైద్యాధికారులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. బుధవారం గద్వాల కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్ ,ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
News April 24, 2025
డోర్నకల్: భూ భారతి పోర్టల్‌ను ప్రారంభించనున్న కలెక్టర్

డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో గురువారం సాయంత్రం 4గం.లకు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొని భూ భారతి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ముఖ్య అతిదులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది తెలిపారు.
News April 24, 2025
నిర్మల్: మండిపోతున్న ఎండలు

నిర్మల్ జిల్లా బుధవారం అగ్నిగుండంగా మారింది. అధికారులు వెల్లడించిన ఉష్ణోగ్రతల ప్రకారం 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు. తీవ్ర ఉక్కుపోత వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 10 గంటలలోపే భరించలేని ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు అధికారులు ఎండల తీవ్రతపై ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.