News November 8, 2024

కామారెడ్డి: ప్లాస్టిక్ సంచిలో డెడ్‌బాడీ లభ్యం..!

image

కామారెడ్డి పట్టణంలోని PMH కాలనీ సమీపంలో రైలు పట్టాల పక్కన గుర్తుతెలియని మృతదేహం లభించింది. మృతుని వయస్సు 35-40 సంవత్సరాల మధ్య ఉంటుందని కామారెడ్డి SHO చంద్రశేఖర్ తెలిపారు. ఎక్కడో హత్య చేసి ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఇక్కడ పారేసినట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు. మృతుని ఒంటిపై తెలుపు రంగు షర్ట్, నీలం రంగు ప్యాంట్ ఉందని మృతునికి సంబంధించి వారు ఉంటే కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.

Similar News

News December 13, 2024

కామారెడ్డి: పాల బిల్లులు చెల్లించాలని వినతిపత్రం అందజేత

image

రైతులకు పెండింగ్ పాల బిల్లుల ఇవ్వాలని కోరుతూ కామారెడ్డి జిల్లా విజయ డెయిరీ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి డీడీసీఎఫ్ రాష్ట్ర ఛైర్మన్ అమిత్‌రెడ్డికి శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. రైతులకు పాల బిల్లులు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే బిల్లులు వచ్చే విధంగా చూడాలని కోరారు. తక్షణమే బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని రాష్ట్ర ఛైర్మన్ అమిత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

News December 13, 2024

నిజాంసాగర్: రైతు సంక్షేమానికి పెద్ద పీట: మంత్రి ఉత్తమ్

image

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభుత్వం పూర్తిగా రైతు పక్ష పాతి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నీటి విడుదల అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే అత్యధికంగా వరి సాగుచేసిన రాష్ట్రాల్లో TG మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. నాగమడుగు ఎత్తి పోతల పథక పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూస్తానని మంత్రి హామి ఇచ్చారు. నిజాంసాగర్ ప్రాజెక్టు‌కు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

News December 13, 2024

కామారెడ్డి: మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే

image

కామారెడ్డి జిల్లాలో పర్యటనకు వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి శుక్రవారం గొర్గల్ గ్రామ హెలిప్యాడ్ వద్ద జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావుతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టుకు వెళ్లనున్నారు. మంత్రి వెంట బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉన్నారు.