News March 9, 2025
కామారెడ్డి: బాధితురాలి వద్దకే జడ్జి

కామారెడ్డిలోని జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో భాగంగా అదనపు జూనియర్ న్యాయమూర్తి దీక్ష బట్టు ఒక కేసులో బాధితురాలు వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలు స్వప్న నడవలేని స్థితిలో ఉండటంతో ఆమె వద్దకు వెళ్లారు. కేసు విషయంలో రాజీ కుదిర్చరు. వెంట న్యాయవాదులు జడల రజనీకాంత్, వేణు ప్రసాద్ ఉన్నారు.
Similar News
News December 13, 2025
NGKL: పోలింగ్తో పాటు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలి: కలెక్టర్

జిల్లాలో రెండో విడత జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్తో పాటు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించి మధ్యాహ్నం ఒంటిగంటకు నిలిపివేయాలని, భోజన విరామం అనంతరం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. 151 గ్రామపంచాయతీలకు గాను 147 గ్రామాలలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
News December 13, 2025
NGKL: 147 గ్రామాలలో 473 మంది సర్పంచ్ అభ్యర్థులు

జిల్లాలో ఈనెల 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 147 గ్రామ పంచాయతీల్లో 473 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 151 గ్రామాలకు గాను 4 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. 1412 వార్డులకు గాను 143 వార్డులు ఏకగ్రీవం కాగా 1269 వార్డులలో 3228 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలోని బిజినేపల్లి, నాగర్కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేరు, తిమ్మాజీపేటలలో ఎన్నికలు జరగనున్నాయి.
News December 13, 2025
నేడు కాణిపాకంలో నెల్లూరు కార్పొరేటర్ల ప్రమాణం.?

నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ఘట్టం <<18549066>>వైకుంఠపాళి<<>>ని తలపిస్తోంది. అవిశ్వాసాన్ని నెగ్గించాలని TDP, అడ్డుకోవాలని YCP పావులు కదుపుతున్నాయి. పలువురు కార్పొరేటర్లు ‘<<18540168>>జంపింగ్ జపాంగ్<<>>’లా మారారు. ఎలాగైనా తమ కార్పొరేటర్లను కాపాడుకోవాలని TDP వారిని తిరుపతి తరలించిందట. మరికాసేపట్లో వారిని కాణిపాకం తరలించి ‘మేము TDPలోనే కొనసాగుతాం’ అని ప్రమాణం చేయించనున్నారట.


