News January 30, 2025
కామారెడ్డి: బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం PSలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన కడారి తరుణ్(20)ను పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డికి చెందిన తరుణ్ బొల్లారంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొంత కాలంగా బాలిక(17)కు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడిపై పోక్సో, అట్రాసిటీ నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి వెల్లడించారు.
Similar News
News November 28, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ WARNING

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను వేలం ద్వారా దక్కించుకోవాలని ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలన్నారు. జిల్లాలో వేలం పద్ధతిలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల వేలం నిర్వహించినా, ప్రయత్నించినా టోల్ ఫ్రీ నంబర్ 8978928637 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
News November 28, 2025
శ్రీహరిపురంలో యువకుడు ఆత్మహత్య

శ్రీహరిపురంలోని తన ఇంట్లో ఓ యువకుడు వంశీ ఫ్యానుకు ఊరివేసుకుని తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాపురం సీఐ గొల్లగాని అప్పారావు తెలిపారు.
News November 28, 2025
KNR: BC కోటా.. ఎవరికి వారే యమునా తీరే..!

BC రిజర్వేషన్ల సాధనలో రాష్ట్రంలోని BC సంఘాల నేతల మధ్య ఐక్యత కొరవడింది. సమష్టిగా ఉద్యమిస్తే పంచాయతీ ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం వెనుకడుగు వేసేదన్న అభిప్రాయం BCల్లో వ్యక్తమవుతోంది. కాగా క్రెడిట్ కోసమే BC సంఘాలు వేర్వేరుగా ముందుకెళ్తున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. అటు కృష్ణయ్య, ఇటు జాజుల శ్రీనివాస్.. ఎవరి JAC వారే పెట్టుకొని GO 46పై ఉద్యమించాలని పిలుపునిచ్చినా ఉమ్మడి KNR BC నేతలెవ్వరూ పట్టించుకోవట్లేదు.


