News January 10, 2026
కామారెడ్డి: మంజీరాలో వ్యక్తి గల్లంతు

మంజీరా నదిలో నాణేల కోసం వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతైన ఘటన బొల్లక్‌పల్లిలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సాయిలు (42) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం మంజీరా నది వద్దకు వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు గాలింపు చేపట్టారు. నది ఒడ్డున అతడి బట్టలు, సెల్‌ఫోన్ లభ్యమయ్యాయి. దీంతో మంజీరా నదిలో గాలింపు చేపట్టారు.
Similar News
News January 14, 2026
సంక్రాంతి సందడి.. పందెం కోళ్లు రె’ఢీ’

AP: సంక్రాంతి పండుగ వేళ కోడిపందేల సందడి మొదలు కానుంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, ఉబయ గోదావరి జిల్లాల్లో భారీ స్థాయిలో బరుల ఏర్పాట్లు చేశారు. మారుమూల ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల్లో పందేలకు ఏర్పాట్లు చేస్తుండగా, వారిని కట్టడి చేసేందుకు పోలీసులు డ్రోన్లతో నిఘా పెంచారు. అయినా నిర్వాహకులు ఎక్కడా తగ్గడం లేదు. కోట్ల రూపాయల పందేలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలలో ఉండే హోటళ్లు హౌస్‌ఫుల్ అయ్యాయి.
News January 14, 2026
శ్రీకాకుళం: భోగికి దూరంగా బూరవెల్లి, లింగాలవలస గ్రామాలు

శ్రీకాకుళం జిల్లాలో గార మండలంలోని బూరవెల్లి, జలుమూరు మండలం లింగాలవలస గ్రామస్థులు భోగి పండగకు దూరంగా ఉంటారు. ఇతర ప్రాంతాల్లో ఉండే బంధువులంతా వచ్చినా ఇక్కడ భోగి మంటను మాత్రం వేయరు. సంక్రాంతి, కనుమ, ముక్కనుమను అందరిలాగే ఘనంగా జరుపుకొంటారు. పెద్దల కాలం నుంచి గ్రామంలో భోగి మంటను వేయడం లేదని, అందువల్ల తాము కూడా భోగి పండుగకు దూరంగా ఉంటామని బూరవెల్లి గ్రామస్థులు చెబుతున్నారు.
News January 14, 2026
సంక్రాంతి ముగ్గులు.. 4 వైపులా గీతలు గీస్తున్నారా?

ముగ్గును ఎప్పుడూ ఇంటి గడప, వాకిలి ముందే వేయాలి. ముగ్గు వేసిన తర్వాత నాలుగు వైపులా అడ్డగీతలు గాలి. ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవని, లక్ష్మీదేవి ఇంటిని విడిచి వెళ్లదని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఆ గీతలు అక్కడ శుభకార్యాలు జరుగుతున్నాయనే మంగళకరమైన సంకేతాన్ని ఇస్తాయి. ఈ నియమాలు పాటిస్తూ ముగ్గులు వేస్తే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది.


