News April 24, 2024
కామారెడ్డి : మంటలంటుకుని రైతు మృతి

బీర్కూర్ మండల కేంద్రానికి అరిగె చిన్నరాములు(64) అనే వ్యక్తి తన పొలంలోని వరికొయ్యలకు సోమవారం నిప్పుపెట్టాడు. దీంతో భారీగా పొగ అతన్ని తాకడంతో సృహతప్పి పొలంలోనే పడిపోయాడు. మంటలు చెలరేగి అతన్ని చుట్టు ముట్టడంతో చిన్నరాములు సజీవ దహనమయ్యాడు. ఉదయం పొలానికి వెళ్లిన రాములు ఇంకా రాలేదని అతని కుమారుడు పొలం వెళ్లి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Similar News
News November 18, 2025
నిజామాబాద్: చలికాలం.. CP జాగ్రత్తలు..!

చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వాహనదారులు పొగమంచు పడుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిజమాబాద్ సీపీ సాయి చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వాహనదారులు తక్కువ వేగం, హై బీమ్ లైట్ కాకుండా లో బీమ్ లైట్లు, రేడియం స్టిక్కర్స్ తదితర నిబంధనలు పాటించాలన్నారు. రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా జాగ్రతలు పాటించాలని ఆయన కోరారు.

స్థానిక పోరుపై ప్రకటన.. ఆశావహుల్లో మళ్లీ ఆశలు..!

సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడంతో జిల్లాలోని పల్లెల్లోని ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముందు గ్రామపంచాయితీ ఎన్నికలు ఉంటాయనడంతో తమ ప్యానెల్ను సిద్ధం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నం అయ్యారు. జూబ్లీహిల్స్లో అధికార పార్టీ గెలవడంతో అదే జోష్లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తుందని గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.