News February 24, 2025
కామారెడ్డి: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.
Similar News
News December 10, 2025
VZM: పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు

ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ ద్వారా పరిష్కరించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అధికారులకు బుధవారం ఆదేశాలు ఇచ్చారు. పోలీసు స్టేషన్ స్థాయిలోనే రాజీ అయ్యే అవకాశం ఉన్న కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, ట్రాఫిక్ కేసులు, చిన్న క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులు, పెండింగ్ చలాన్లను ముందుగా గుర్తించాలని సూచించారు.
News December 10, 2025
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: BHPL ఎస్పీ

రేపు పోలింగ్ జరిగే మొగుళ్లపళ్లి, కొత్తపల్లిగోరి, రేగొండ, గణపురం మండలాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హెచ్చరించారు. ఉదయం ప్రారంభం నుంచే విధి స్థానాలకు హాజరు కావాలని,
ఓటర్లు ఇబ్బంది లేకుండా ఓటు వేయడానికి అవసరమైన సహాయాన్ని అందించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో గుమికూడటం నిషేధం అన్నారు.
News December 10, 2025
NLG జిల్లాలో మొదటి విడత ఎన్నికల వివరాలు

NLG జిల్లాలో చండూరు, నల్లగొండ డివిజన్లలో మొత్తం 14 మండలాల్లో మొదటి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
✈ సర్పంచ్ స్థానాలు: 294
✈ అభ్యర్థులు: 966 మంది
✈ వార్డు స్థానాలు: 2870
✈ అభ్యర్థులు: 5934 మంది
✈ పోలింగ్ కేంద్రాలు: 2870
✈ ఓట్ల లెక్కింపు: 2 గం. నుంచి
✈ పీవోలు (పోలింగ్ అధికారులు): 3444 మంది
✈ ఉప పీవోలు: 4448 మంది


