News February 24, 2025
కామారెడ్డి: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.
Similar News
News March 17, 2025
ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి

ఓర్వకల్ విమానాశ్రయానికి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉయ్యాలవాడ పేరు పెట్టాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.
News March 17, 2025
రేపు మేదరమెట్లకు వైఎస్ జగన్

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మేదరమెట్లలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు. ఆమె మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న వైవీ సుబ్బారెడ్డి తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయల్దేరారు.
News March 17, 2025
ADB: ఆ రైతు గ్రేట్.. తొలికాత విద్యార్థులకే

సహజంగా ఏ రైతైనా పంట తొలికాతను దేవుడికి సమర్పిస్తుంటారు.. కానీ ఆ రైతు మాత్రం తాను పండించిన పంటను ముందుగా విద్యార్థులకే అందిస్తుంటారు. బాలల్లోనే తాను దైవాన్ని చూస్తానని చెబుతున్నారు. ADBజిల్లా తాంసి మండలం పొన్నారికి చెందిన రైతు అండే ఆనంద్ తాను సాగుచేస్తున్న పుచ్చకాయ(వాటర్‌మిలన్) తొలికాతను ఏటా విద్యార్థులకు పంచి పెడుతున్నారు. రైతును పలువురు అభినందిస్తున్నారు. మీ ప్రాంతంలో ఇలా ఉంటే కామెంట్ చేయండి.