News January 13, 2026

కామారెడ్డి: మత్తులో నడిపితే.. జైలులో పడాల్సిందే!

image

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కామారెడ్డి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 33 మందికి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి నలుగురికి రెండు రోజులు, పది మందికి ఒక రోజు జైలు శిక్ష విధించారు. మిగిలిన వారితో కలిపి మొత్తం రూ.38,500 జరిమానా విధించినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం తెలిపింది. ప్రజల భద్రత కోసం తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని SP స్పష్టం చేశారు.

Similar News

News February 18, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.14,140
* 10 గ్రాములు వెండి ధర రూ.2,460.

News February 18, 2026

జుట్టు పొడిబారకుండా ఉండాలంటే?

image

పొడిబారి ఉన్న కురులకు గాఢత తక్కువగా, తేమను పెంచే షాంపూలను ఎంచుకోవాలి. పొడి జుట్టు ఉన్నవారు సల్ఫేట్‌ ఫ్రీ ఫార్ములాతో ఉన్న మాయిశ్చరైజింగ్‌ షాంపూలను ఎంచుకోవాలి. తేమను నిలిపే హైలురోనిక్‌ యాసిడ్, స్క్వాలేన్‌ వంటివి ఉండేలా చూసుకోవాలి. తలస్నానం చేశాక కండిషనర్‌ తప్పనిసరిగా రాసుకోవాలి. అయినా సమస్య తగ్గకపోతే డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించి పోషకాల లేమి ఏమైనా ఉంటే… సప్లిమెంట్స్‌ వాడాల్సి ఉంటుంది.

News February 18, 2026

బెండలో కాండం తొలిచే పురుగు నివారణ ఎలా?

image

బెండను మొవ్వు, కాయ తొలుచు పురుగు ఆశించడం వల్ల మొక్కలు చనిపోవడంతో పాటు కాయలు పనికిరాకుండా పోతాయి. ఈ పురుగుల నివారణకు కొమ్మలకు రంధ్రం చేసిన ప్రాంతం నుంచి అంగుళం కిందకు తుంచి నాశనం చేయాలి. లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml లేదా క్వినాల్‌ఫాస్ 2ml చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి. పంట కాపునకు రాని దశలో లీటరు నీటికి థయోడికార్బ్ 1గ్రా. కలిపి పిచికారీ చేయాలి.