News August 2, 2024
కామారెడ్డి: మద్యం తాగి చెరువులో దూకేశాడు
యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి(D) బీర్కూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రవీణ్‌కుమార్(25) ఎలక్ట్రిషీయన్‌గా పనిచేస్తున్నాడు. మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని తల్లిని అడగగా ఇవ్వలేదు. దీంతో అమ్మమ్మను, తల్లిని కొట్టి మద్య తాగి, బాజన్ చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సమాచారం అందుకున్న పోలీసులు కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Similar News
News October 12, 2024
పండగ వేళ బోధన్‌లో కత్తిపోట్లు
దసరా పండగ వేళ బోధన్ పట్టణంలోని గాంధీనగర్లో కత్తిపోట్ల ఘటన శనివారం కలకలం రేపింది. కాలనీకి చెందిన రేహాన్, జావిద్, బబ్లు ఓ చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అటుగా వెళ్తున్న మన్సుర్ తన గురించే వారు మాట్లాడుకుంటున్నారనే అనుమానంతో కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు పోలీసులు కేసు, దర్యాప్తు చేస్తున్నారు.
News October 12, 2024
NZB: ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్‌లో మనవాళ్లకు మెడల్స్
ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు మెడల్స్ సాధించారు. మలేషియాలో నిర్వహిస్తున్న 36వ మలేషియా ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్‌లో శుభారంభం పలికారు. ఇందులో భాగంగా 35+ ఏజ్ గ్రూపులో జరిగిన లాంగ్ జంప్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన వాగ్మారే దినేష్ గోల్డ్ మెడల్, యాష్లీ గోపి సిల్వర్ మెడల్ సాధించారు. వీరు విద్యుత్ శాఖ ఉద్యోగులుగా ఉన్నారు.
News October 12, 2024
NZB: విషాదం.. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
బోధన్ మండలంలోని అమ్డాపూర్ గ్రామానికి చెందిన మల్లారం(55) అనే వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్లి మృతి చెందినట్లు రూరల్ ఎస్సై మశ్చేందర్ రెడ్డి తెలిపారు. గ్రామ శివారులో గల బెల్లాల్ చెరువులోకి చేపలు పట్టడానికి వల వేసే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు వల చుట్టుకుని చెరువులో పడి మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామని అన్నారు.