News February 14, 2026

కామారెడ్డి: మద్యం మత్తులో డ్రైవింగ్.. 13 మందికి జైలు శిక్ష

image

ఒక్క క్షణం అజాగ్రత్త కుటుంబాల్లో శాశ్వత విషాదాన్ని నింపుతుందని కామారెడ్డి SP రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపిన 146 మందికి కోర్టు శిక్షలు విధించిందన్నారు. వారిలో 13 మందికి ఒక రోజు జైలు శిక్ష పడగా, రూ.2 లక్షల జరిమానా విధించినట్లు ఆయన వెల్లడించారు.

Similar News

News March 10, 2026

HYD: అర్ధరాత్రి సందడే.. సందడి!

image

రంజాన్ పండుగ సమీపిస్తున్న తరుణంలో HYDలో పది రోజుల పాటు సందడి నెలకొననుంది. చార్మినార్, టోలిచౌకి, పాతబస్తీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నైట్ బజార్లకు నగర నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివస్తుండటంతో అర్ధరాత్రి వేళ కూడా ఆ వీధులన్నీ షాపింగ్ ప్రియులతో కళకళలాడుతున్నాయి. పాతబస్తీలో వ్యాపారాలు జోరందుకోగా, పెరిగిన వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు.

రాత్రి మంచి నిద్ర కోసం..

image

రాత్రి వేళ చక్కటి నిద్ర కోసం ఆహారంలో అరటిపండు, పిస్తా, బార్లీ, పాలు, పెరుగు, గుడ్డు తెల్లసొన, గుమ్మడి విత్తనాలు భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలోని ట్రిప్టోఫాన్ నిద్రలో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇక కొంతమంది రాత్రి మద్యం తాగితే మంచి నిద్ర పడుతుందని భావిస్తారని, ఇందులో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. దానివల్ల నిద్రకు భంగం కలుగుతుందన్నారు.
Share It