News August 2, 2024
కామారెడ్డి: మహిళను హత్య చేసిన ఘటనలో వ్యక్తి అరెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1722571189714-normal-WIFI.webp)
ఇటీవల ఓ వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసినట్లు నిందితుడు మాధవ్ అంగీకరించడంతో అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉమా భర్త అశోక్‌తో మూడేళ్ల క్రితమే విడిపోయింది. దీంతో పంచముఖి కాలనీలో అద్దె ఇంట్లో ఉమా, మాధవ్ సహజీవనం చేస్తున్నారు. తనతో గొడవ పడిందని, ఆమె మెడకు చున్నీ బిగించి, గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నారని చెప్పారు.
Similar News
News February 7, 2025
కోటగిరి: ఎత్తోండ క్యాంపులో అక్రమ ఇసుక డంపులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738848309901_51940040-normal-WIFI.webp)
కోటగిరి మండలం ఎత్తోండ క్యాంపును అడ్డగా మలుచుకున్న కొందరు ఇసుక సూరులు యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద గల ఖాళీ స్థలంలో ఇసుక డంపులు చేసి రాత్రికి రాత్రి వాటిని టిప్పర్ల ద్వారా బోధన్, నిజాంబాద్ పట్టణాలకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఈ విషయమై గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడంలేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
News February 7, 2025
నిజామాబాద్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738860180619_50139228-normal-WIFI.webp)
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో మాక్లూర్‌కు చెందిన షేక్ ఫర్వాన్ (24), షేక్ ఇంతియాజ్ (22) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా లారీ డ్రైవర్ పరారైనట్లు ఎస్ఐ ఆరీఫ్ వెల్లడించారు.
News February 7, 2025
NZB: కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738846225521_50139228-normal-WIFI.webp)
రైతు భరోసా నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం పట్ల బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. వెంటనే ఏకకాలంలో రైతు భరోసా నిధులు అన్నిటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సర్పంచులకు పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.