News March 24, 2025
కామారెడ్డి: మాదకద్రవ్యాల నిర్మూలనకు నార్కోటిక్స్ సమావేశం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జిల్లా నార్కోటిక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాల వినియోగ నిర్మూలన కోసం వైద్య ఆరోగ్య, పోలీసు, విద్యా, స్త్రీ, శిశు సంక్షేమ తదితర శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళిక తయారు చేశారు. SP రాజేశ్ చంద్ర, ASP చైతన్య రెడ్డి, DMHO డా.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Similar News
News November 21, 2025
రాష్ట్రంలో 32మంది IPSల బదిలీ

TG: పంచాయతీ ఎన్నికల వేళ 32మంది IPSలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ADG పర్సనల్గా చౌహాన్, CID DIGగా పరిమళ నూతన్, మహేశ్వరం DCPగా నారాయణరెడ్డి, తెలంగాణ నార్కోటిక్ SPగా పద్మ, నాగర్ కర్నూల్ SPగా సంగ్రామ్ పాటిల్, సౌత్ జోన్ DCPగా కిరణ్ కారే, వనపర్తి SPగా సునీత, మల్కాజ్గిరి DCPగా శ్రీధర్, ఆసిఫాబాద్ SPగా నిఖితా పంత్, TG యాంటీ నార్కోటిక్స్ బ్యూరో SPగా గిరిధర్ తదితరులు బదిలీ అయ్యారు.
News November 21, 2025
PMAY-G పేరు నమోదు చేసుకోండి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (PMAY-G 2.0) కింద గృహాల కోసం లబ్ధిదారుల పేర్ల నమోదు చేసుకోవాలని కర్నూలు కలెక్టర్ డా.సిరి సూచించారు. గ్రామ/వార్డు సచివాలయంలో పేర్ల నమోదుకు ఈ నెల 30లోపు పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News November 21, 2025
మత్స్యకారులకు అండగా వైసీపీ: జగన్

AP: మత్స్యకారులకు తమ పార్టీ అండగా ఉంటుందని YCP అధ్యక్షుడు జగన్ తెలిపారు. ‘సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న నా గంగ పుత్రులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. వారి సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాం. రూ.4,913 కోట్లు లబ్ధి చేకూర్చాం’ అని ట్వీట్ చేశారు.


