News July 15, 2024
కామారెడ్డి: మానవత్వం చాటుకున్న రైల్వే ఎస్ఐ

కామారెడ్డి రైల్వే ఎస్ఐ తావు నాయక్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని ప్రయాణికుడు ఫిట్స్ సమస్యతో బాధపడుతుండగా గమనించిన ఆయన వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
Similar News
News December 1, 2025
NZB: 19 మంది మహిళలకు కొత్త మద్యం దుకాణాలు

NZB జిల్లాలో సోమవారం నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభంకానున్నయి. రెండేళ్ల కాల పరిమితితో జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు గత నెలలో 102 మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. మద్యం దుకాణాలకు 2,786 మంది దరఖాస్తులు చేసుకోగా ఎక్సైజ్ శాఖకు రూ.83.58 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్ 27 తేదీన 102 దుకాణాలకు లాటరీ పద్ధతిన లక్కీడ్రా తీశారు. ఇందులో 19 మంది మహిళలకు కొత్త మద్యం దుకాణాలు దక్కడం విశేషం.
News December 1, 2025
NZB: రెండో దశ తొలి రోజు 270 నామినేషన్లు

NZB జిల్లాలో రెండో విడతలో జరగనున్న 8 మండలాల్లో తొలి రోజైన ఆదివారం 196 సర్పంచి స్థానాలకు 122, 1760 వార్డు స్థానాలకు 148 నామినేషన్లు దాఖలు అయ్యాయని అధికారులు తెలిపారు. రెండో విడతలో NZB డివిజన్లోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ మండలాలతో పాటు ఆర్మూర్ డివిజన్లోని జక్రాన్ పల్లి మండలాల పరిధిలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.