News January 17, 2025

కామారెడ్డి: మార్కెట్‌లో MLA 

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ గ్రామ వారాంతపు సంతలో శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పర్యటించారు. సంతలో కూరగాయలు విక్రయించడానికి వచ్చిన రైతులు, వ్యాపారులతో ఎమ్మెల్యే ముచ్చటించారు. వారి దగ్గర కూరగాయలు కొనుగోలు చేసి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఒక సామాన్యుడిలా సంతలో పర్యటించి తమ సమస్యలు తెలుసుకుని కూరగాయలు కొనుగోలు చేయడంపై రైతులు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు.

Similar News

News February 7, 2025

మరోసారి.. ఢిల్లీ స్కూళ్లకు ఆగని బాంబు బెదిరింపులు

image

దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఇవాళ ఉదయం మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఢిల్లీతో పాటు నోయిడాలోని పాఠశాలలకు కూడా ఈ థ్రెట్స్ రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయా స్కూళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

News February 7, 2025

ADB:చైన్ దొంగలించబోయి దొరికిపోయాడు!

image

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి మాధస్తు మహేందర్ తన తల్లి విజయలక్ష్మితో కలిసి వాళ్ల బంధువులను చూడడానికి గురువారం సాయంత్రం వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏమాయికుంటకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి విజయలక్ష్మి మెడలోని గొలుసును లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో వారు దొంగ దొంగ అని అరవడంతో పారిపోగా..సెక్యూరిటీ పట్టుకొని పోలీసులకు అప్పగించారు.ఈ మేరకు రిమాండ్‌కు టూ టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు.

News February 7, 2025

ఉంగుటూరు: రోడ్డు ప్రమాద మృతులు కృష్ణా జిల్లా వాసులు

image

ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారిపై రాత్రి జరిగిన <<15374910>>రోడ్డు ప్రమాదంలో<<>> ఇద్దరు చనిపోయిన సంగతి విదితమే. మృతులు కృష్ణా(D) బాపులపాడు మండలం ఆరుగొలనుకు చెందిన దేవ మందిరం, విజయ్ బాబుగా గుర్తించారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబాల్లో వీరి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. దేవ మందిరానికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విజయ్‌బాబుకి భార్య, ఐటీఐ చదివే కుమారుడు, టెన్త్ చదువుతున్న కుమార్తె ఉన్నారు.

error: Content is protected !!