News February 25, 2025
కామారెడ్డి: మార్చి 8న లోక్ అదాలత్

మార్చ్ 8న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయమూర్తి టి.నాగరాణి తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి బ్యాంకు అధికారులతో న్యాయమూర్తి సమావేశమై, మాట్లాడారు. వీలైనంత వరకు ఎక్కువ మొత్తంలో బ్యాంకు కేసులను పరిష్కరించడానికి సహకరించాలని అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
Similar News
News February 25, 2025
ఘన్‌పూర్: సభను విజయవంతం చేయండి: మల్లు రవి

వచ్చే నెల 2న వనపర్తి కి సీఎం రేవంత్ రెడ్డి విచ్చేయుచున్నట్లు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని రూ.500 కోట్లతో లోన్ మేళా, జాబ్ మేళా, స్కిల్ డెవలప్ మెంట్ మేళాలకు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
News February 25, 2025
FLASH: నర్సంపేట: చింత చెట్టు కూలి ఒకరి మృతి

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మాదన్నపేట గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సుంచు రవిపై మంగళవారం చింత చెట్టు కూలింది. తీవ్ర గాయాల పాలైన రవి అక్కడికక్కడే మృతిచెందాడు. రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 25, 2025
విశాఖ: 123 పోలింగ్ కేంద్రాలు.. 22,493 మంది ఓటర్లు

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారి హరేంద్ర ప్రసాద్ తెలిపారు. 123 పోలింగ్ కేంద్రాలలో 22,493 మంది టీచర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 144 సెక్షన్ విధిస్తామన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 739 మంది అధికారులను, సిబ్బందిని కేటాయించామన్నారు. 148 మంది పీవోలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.