News April 3, 2025
కామారెడ్డి: ముగిసిన పది పరీక్షలు.. జాగ్రత్త

నిన్నటితో పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా తిరగాలని భావిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు బైకులు ఇవ్వొద్దని, స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలన్నారు. వారు ఈత నేర్చుకుంటానంటే పేరెంట్సే పర్యవేక్షించాలని, మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారో లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు.
Similar News
News April 25, 2025
రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2022, నవంబరు 17న భారత్ జోడో యాత్రలో దివంగత సావర్కర్‌ను ‘బ్రిటిష్ ఏజెంట్’గా రాహుల్ అభివర్ణించారు. ఆ వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం మండిపడింది. స్వాతంత్ర్య సమరయోధుల్ని అవమానిస్తే చూస్తూ ఉండబోమని తేల్చిచెప్పింది. ఇది మళ్లీ రిపీటైతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
News April 25, 2025
మొదటి సిక్స్ ప్యాక్ ఎవరిది?.. హీరోల మధ్య వివాదం

తొలి సిక్స్ ప్యాక్ ఎవరిదన్న విషయంపై తమిళనాట హీరోల మధ్య వివాదం నెలకొంది. ఇండస్ట్రీలో ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసింది సూర్య అని ఆయన తండ్రి శివకుమార్ ఓ కార్యక్రమంలో అన్నారు. అతడిలా ఎవరూ కష్టపడలేరని కామెంట్ చేశారు. దీనిపై విశాల్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘అందరికంటే ముందుగా సిక్స్ ప్యాక్ చేసింది ధనుష్. ఆ తర్వాత ‘సత్యం’ కోసం నేను చేశాను’ అని గుర్తుచేశారు. ఇది కోలీవుడ్ ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీసింది.
News April 25, 2025
నల్గొండ: కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం

టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వెంటాడుతుంది. ప్రస్తుతమున్న వారు డబుల్ డ్యూటీ చేయటం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శాశ్వత ప్రాతిపదికన డ్రైవర్ల నియామకం జరిగే వరకు తాత్కాలిక పద్ధతిన డ్రైవర్లను నియమించేందుకు నిర్ణయించినట్లు ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, నార్కట్ పల్లి, కోదాడ, దేవరకొండ డిపోల్లో 90 మంది డ్రైవర్లను నియమించనున్నట్లు తెలిపారు.