News October 7, 2024

కామారెడ్డి: మూడు ఉద్యోగాలు వద్దని లేఖ

image

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అరుణ మూడు ఉద్యోగాలను వదులుకున్నారు. 2018లో TGT, PGT ఉద్యోగాలు రాగా, 2019లో JLగా ఎంపికై విధుల్లో చేరారు. అనంతరం DL ఉద్యోగం రావడంతో JL ఉద్యోగం వదులుకున్నారు. తాజాగా DSCలో ర్యాంకు సాధించారు. అరుణ తాను సాధించిన 5 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలకు నాట్ విల్లింగ్ లేఖను డీఈఓకు అందజేసింది. లెటర్ ఇవ్వడం వల్ల ఉద్యోగాలు ఇతరులకు వచ్చే అవకాశం ఉంది అని అన్నారు.

Similar News

News December 30, 2024

NZB: ఈ ఏడాది క్రైమ్ రేట్ వివరాలు ఇలా..

image

NZB జిల్లాలో ఈ ఏడాదికి సంబంధించిన కేసుల వివరాలను ఇన్ ఛార్జ్ CP సింధు శర్మ వెల్లడించారు. శారీరక నేరాలు, ఆస్తి నేరాలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కాస్త ఎక్కువే అయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ, మృతి చెందిన కేసులు, సైబర్ నేరాలు, పోక్సో, మిస్సింగ్, గేమింగ్ ఆక్ట్ కేసులు కూడా ఎక్కువగానే నమోదయ్యాయి. గతేడాది 356 ఆత్మహత్యలు జరగగా ఈ యేడు 442 జరిగాయి. గాంజా కేసులు 22 నమోదు కాగా 58 మందిని అరెస్ట్ చేశామన్నారు.

News December 30, 2024

NZB: ప్రతీ ఒక్కరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి: కవిత 

image

మనం ఊరుకుంటే ప్రభుత్వం కదలదు… ప్రతీ ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఆదివారం ఆమె నిజామాబాద్ సభలో మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు. కాగా విద్యార్థులు, రైతులు, మహిళలను, ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు.

News December 29, 2024

NZB: రేపు Jr. కళాశాలల ప్రిన్సిపాల్‌లతో కలెక్టర్ సమన్వయ సమావేశం

image

నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ ఇతర అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్‌లతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహిస్తున్నట్టు జిల్లా ఇంటర్ విద్యా అధికారి (DIEO) రవికుమార్ తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు మానసిక సంసిద్ధతను పెంపొందించేందుక, విద్యార్థుల్లో ఆంటీ డ్రగ్స్, ఆత్మహత్యల నిరోధించేందుకు తదితర అంశాలపై సమీక్ష జరుపనున్నారని, అందరూ హాజరుకావాలని ఆయన సూచించారు.