News October 7, 2024

కామారెడ్డి: మూడు ఉద్యోగాలు వద్దని లేఖ

image

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అరుణ మూడు ఉద్యోగాలను వదులుకున్నారు. 2018లో TGT, PGT ఉద్యోగాలు రాగా, 2019లో JLగా ఎంపికై విధుల్లో చేరారు. అనంతరం DL ఉద్యోగం రావడంతో JL ఉద్యోగం వదులుకున్నారు. తాజాగా DSCలో ర్యాంకు సాధించారు. అరుణ తాను సాధించిన 5 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలకు నాట్ విల్లింగ్ లేఖను డీఈఓకు అందజేసింది. లెటర్ ఇవ్వడం వల్ల ఉద్యోగాలు ఇతరులకు వచ్చే అవకాశం ఉంది అని అన్నారు.

Similar News

News November 2, 2024

నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ

image

నిజామాబాద్ సుభాష్ నగర్ న్యూ ఎన్జీవో కాలనీలో తాళం వేసిన ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. కాలనీకి చెందిన సముద్రాల ఏలేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి ఊరెళ్లగా గుర్తు తెలియని దొంగలు తాళం పగుల గొట్టి చోరికి పాల్పడ్డారు. బీరువాలోని 22 తులాల బంగారు, 8 తులాల వెండి ఆభరణాలు దోచుకుపోయారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ SHO మహేశ్ తెలిపారు.

News November 2, 2024

NZB: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..

image

కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

News November 2, 2024

NZB: గంజాయి స్మగ్లర్లకు సహకారం.. ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

image

గంజాయి స్మగ్లర్లకు సహకరించిన పటాన్‌చెరు ఎస్సై అంబరియా, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ మారుతి నాయక్, ఏఆర్ కానిస్టేబుల్ మధును సస్పెండ్ చేస్తూ ఐజీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. మనూరు ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో సనాత్పూర్, నిజామాబాద్ జిల్లా వర్ని వద్ద గంజాయి పట్టుకొని నిందితులను వదిలిపెట్టారు. నిందితులు మరోసారి పట్టు పడడంతో విషయం బయటపడింది. ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదుకు పరిశీలిస్తున్నట్లు వివరించారు.