News November 20, 2024

కామారెడ్డి: రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి : కలెక్టర్ సంగ్వాన్

image

రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా నేడు జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తోందన్నారు. మహిళాశక్తి కార్యక్రమం కింద క్యాంటీన్ల ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News December 30, 2025

BIG BREAKING: నిజామాబాద్: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

image

TGలో మున్సిపల్ ఎన్నికల సందడి అధికారికంగా మొదలైంది. నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్, భీమ్‌గల్, బోధన్ మున్సిపాలిటీల కమిషనర్లతో ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు VC నిర్వహించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని ఆదేశించారు. రిజర్వేషన్ల గెజిట్ వెలువడగానే అధికారిక నోటిఫికేషన్ రానుంది.
SHARE IT

News December 30, 2025

BREAKING: నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బదిలీ

image

నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను GHMC అడిషనల్ కమిషనర్ (మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్స్)గా నియమించారు. ఇక నిజామాబాద్ కలెక్టర్‌గా 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రస్తుత నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి రానున్నారు.

News December 30, 2025

ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై కమిషనర్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనవరి 10వ తేదీన తుది ఓటరు జాబితా వెలువరించాలని సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.