News March 14, 2025
కామారెడ్డి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్

ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణ తదితర వాటిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ జిల్లా కలెక్టర్, ఈఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. సమావేశం వివరాలు.. మినిట్స్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేస్తూ, సీఈఓ కార్యాలయానికి సమర్పిస్తామని తెలిపారు.
Similar News
News November 13, 2025
కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్ట్.. అప్డేట్ ఇచ్చిన మంత్రి

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ విశాఖలో మాయా వరల్డ్ను VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్తో కలిసి గురువారం సందర్శించారు. మ్యూజియం వివరాలను మంత్రికి ప్రణవ్ వివరించారు. విశాఖకి వచ్చే పర్యాటకులను, సందర్శకులను ఆకర్షించేలా మ్యూజియంను ఉందని, పర్యాటకానికి చిరునామాగా విశాఖ మారిందన్నారు. కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్ట్ను వచ్చే శివరాత్రి నాటికి, గ్లాస్ బ్రిడ్జిను కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
News November 13, 2025
రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా: పార్వతీపురం డీఈవో

SCERT డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు రేపు జరగాల్సిన SA-1 పరీక్షను బాలల దినోత్సవం సందర్భంగా వాయిదా వేసినట్లు పార్వతీపురం డీఈవో బి.రాజ్ కుమార్ తెలిపారు. వాయిదా వేసిన పరీక్షను I నుంచి V తరగతులకు 17న, VI నుంచి X తరగతులకు 20న నిర్వహించబడుతుందని తెలిపారు. హెచ్ఎంలు బాధ్యత వహించి ప్రతీ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని తెలిపారు.
News November 13, 2025
NRPT: ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయాలి

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయాలని రాష్ట్ర అల్ మేవ అధ్యక్షుడు షేక్ ఫరూక్ హుస్సేన్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నారాయణపేట మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసి అనేక అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. మైనారిటీ పాఠశాల, కళాశాలలో నియామకాలను కార్పొరేషన్ ద్వారా చేపట్టాలని కోరారు.


