News January 25, 2025

కామారెడ్డి: రిపబ్లిక్ డే పరేడ్‌కు ప్రభుత్వ కళాశాల విద్యార్థి

image

కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ధరావత్ మౌనిక ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్సీసీ అధికారి లెఫ్ట్నెంట్ డాక్టర్ ఏ.సుధాకర్‌ను ప్రిన్సిపల్ ప్రత్యేకంగా అభినందించారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ప్రతి సంవత్సరం కళాశాల విద్యార్థులు ఎంపిక అవుతున్నారన్నారు.

Similar News

News November 21, 2025

ADB: లోకల్ వార్.. అయోమయంలో బీసీలు

image

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం మళ్లీ కసరత్తు ప్రారంభించింది. గతంలో ఇచ్చిన రిజర్వేషన్లపై ప్రతిష్ఠ కొనసాగుతుండటంతో పార్టీ పరంగా 42% బీసీలకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీలు ఆమోదించాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1514 GPలు, 581 ZPTC, 69 MPTC స్థానాలు ఉండగా.. బరిలో నిలవాలనుకున్న బీసీలు అయోమయంలో ఉన్నారు.

News November 21, 2025

వరంగల్‌: రేపు జాబ్ మేళా

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి బి. సాత్విక కోరారు. ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ వద్ద ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు ఉండి, ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ మేళాకు అర్హులన్నారు.

News November 21, 2025

HYD: దొంగ నల్లా కనెక్షన్‌పై ఫిర్యాదు చేయండి

image

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నల్లా అక్రమ కనెక్షన్లపై అధికారుల రైడ్ కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో దాదాపుగా 50 మందికిపైగా వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకున్న వారు, కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తే 99899 98100 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.