News January 25, 2025
కామారెడ్డి: రిపబ్లిక్ డే పరేడ్‌కు ప్రభుత్వ కళాశాల విద్యార్థి

కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ధరావత్ మౌనిక ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్సీసీ అధికారి లెఫ్ట్నెంట్ డాక్టర్ ఏ.సుధాకర్‌ను ప్రిన్సిపల్ ప్రత్యేకంగా అభినందించారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ప్రతి సంవత్సరం కళాశాల విద్యార్థులు ఎంపిక అవుతున్నారన్నారు.
Similar News
News February 18, 2025
BREAKING: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో తప్పిన ప్రమాదం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన బ్లూ డార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య ఏర్పడింది. దీంతో రన్ వేపై అత్యవసర ల్యాండింగ్‌కు పైలెట్ అనుమతి కోరారు. అనంతరం కార్గో ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు.
News February 18, 2025
బోరుబావుల నుంచి ఉబికి వస్తున్న వేడి నీరు..!

భద్రాద్రి జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మణుగూరు మండలం పగిడేరులో పలు బోరుబావుల నుంచి వేడి నీరు ఉబికి వస్తోంది. ఈ నీటిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. సమీపంలో ఉన్న గోదావరి నీరు భూమి అంతర్భాగంలో ప్రవహిస్తుండటం వంటి కారణాలతో వేడినీరు వచ్చే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వచ్చి వేడినీటిని చూసి ఆశ్చర్యపోతున్నారు.
News February 18, 2025
నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నర్సంపేట -పాకాల మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగి యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. అశోక్ నగర్‌కు చెందిన వెంకటేశ్ నర్సంపేటలో షాపులో పని చేస్తుండేవాడు. సోమవారం రాత్రి పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళుతున్న క్రమంలో ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.