News March 12, 2025

కామారెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారిణీగా వీణ

image

కామారెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారిణీగా వీణ బుధవారం విధుల్లో చేరారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈమె మేడ్చల్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణీగా విధులు నిర్వర్తించి.. కామారెడ్డికి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఆర్డీవోగా పని చేసిన రంగనాథ్ రావు ఇటీవల పదవీ విరమణ పొందారు.

Similar News

News September 13, 2025

నెల్లూరు SP కృష్ణకాంత్ బదిలీ

image

నెల్లూరు SP కృష్ణకాంత్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అజిత వేజెండ్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల SPలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

News September 13, 2025

షూటింగ్‌లు చేసేందుకు కాదు మీకు ఓటేసింది: పవన్‌పై రోజా ఫైర్

image

AP: రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను Dy.CM పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా ప్యాకేజీలు తీసుకుంటూ కాలం గడిపేస్తున్నారని YCP నేత రోజా విమర్శించారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు పవన్ మద్దతివ్వడం దారుణమన్నారు. ‘ఆయనకు ఓట్లు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. Dy.CM స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ ప్రభుత్వ ధనం వృథా చేస్తున్నారు. షూటింగ్‌లు చేసుకునేందుకు కాదు ప్రజలు ఆయనకు ఓట్లేసింది’ అంటూ ఆమె ఫైర్ అయ్యారు.

News September 13, 2025

ఒత్తయిన కనుబొమ్మలకి ఈ చిట్కాలు

image

అందమైన, ఒత్తయిన కనుబొమ్మల కోసం అమ్మాయిలు ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. వారంలో రెండుసార్లు పెట్రోలియం జెల్లీని ఐబ్రోస్‌కి అప్లై చేసి, మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ జరిగి కనుబొమ్మలు అందంగా పెరుగుతాయి. మెంతిపిండిలో కొబ్బరినూనె కలిపి కనుబొమ్మలకు రాత్రి అప్లై చేసి, ఉదయం శుభ్రం చేసుకోవాలి. మెంతిలో ఉండే నికోటినిక్ ఆమ్లం, లెసిథిన్లు కనుబొమ్మలు ఒత్తుగా పెరగటానికి సహాయపడతాయి.