News March 12, 2025

కామారెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారిణీగా వీణ

image

కామారెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారిణీగా వీణ బుధవారం విధుల్లో చేరారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈమె మేడ్చల్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణీగా విధులు నిర్వర్తించి.. కామారెడ్డికి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఆర్డీవోగా పని చేసిన రంగనాథ్ రావు ఇటీవల పదవీ విరమణ పొందారు.

Similar News

News February 8, 2026

పిట్లం: కూలి డబ్బుల కోసం హత్య

image

పిట్లంలో ఈ నెల <<19069742>>6న జరిగిన హత్య<<>> కేసును పోలీసులు ఛేదించారు. బాన్సువాడ DSP విఠల్ రెడ్డి వివరాలు వెల్లడించారు. UPకి చెందిన రాజేశ్, శ్రీకృష్ణ పెయింటింగ్ పనుల కోసం పిట్లం వచ్చారు. కూలీ డబ్బుల విషయంలో వారిద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో రాజేశ్‌ను శ్రీకృష్ణ కర్రతో కొట్టి హత్య చేసి పరారయ్యాడు. నిందితుడు ఊరు విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News February 8, 2026

చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>చెన్నై <<>>మెట్రో రైల్ లిమిటెడ్ 19 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు ఫిబ్రవరి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, ME/MTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.62,000 నుంచి రూ.2,70,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://chennaimetrorail.org

News February 8, 2026

విద్యార్థులకు అస్వస్థత.. కారకులపై CM సీరియస్

image

AP: పోలవరం(D) దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్‌ విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడానికి గల కారకులపై CM CBN ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి‌లోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. బాధ్యులపై శాఖాపరమైన, అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. కాగా నిన్న టిఫిన్ చేశాక 92మంది విద్యార్థులకు కడుపునొప్పి, జ్వరం రావడంతో ఆస్పత్రులకు తరలించామని అధికారులు వివరించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కుదుటపడిందన్నారు.