News June 2, 2024
కామారెడ్డి. రేపటి నుంచి టెన్త్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు
పదో తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆయా కేంద్రాలకు అరగంట ముందుగా చేరుకోవాలని సూచించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.
Similar News
News September 17, 2024
NZB: నిమజ్జనానికి వేళాయె.. సర్వం సిద్ధం.!
11 రోజుల పాటు విశేష పూజలందుకున్న లంబోదరుడు మరి కొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నందిపేట మండలంలోని ఉమ్మెడ, బాసర గోదావరి తీరాన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. నిమజ్జనం సందర్భంగా 2 వెల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లపై ఆదివారం చంద్ర శేఖర్ రెడ్డి పోలీసు ఉన్నత అధికారులకు సలహా, సూచనలు చేశారు.
News September 17, 2024
వర్ని: కొడవలితో భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త
భార్య గొంతుకోసి భర్త హత్య చేసిన ఘటన వర్నిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన పెంటవ్వ(46), భర్త బాలయ్య మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న బాలయ్య క్షణికావేశంలో కొడవలితో ఆమె గొంతు కోయడంతో పెంటవ్వ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 17, 2024
ఎల్లారెడ్డి: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
కామారెడ్డి జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకొంది. ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేటలో ప్రమదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుజ్జిగారి ఏశయ్య(25) స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని పటేల్ చెరువులో వినాయక నిమజ్జనానికి వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఈత రాక మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.