News April 9, 2025
కామారెడ్డి: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వడియారం-మిర్జాపల్లి రైల్వే స్టేషన్ మధ్య ప్రాంతంలో మంగళవారం వెలుగు చూసింది. పట్టాలపై మృతదేహం పడి ఉందని సమాచారం రావడంతో కామారెడ్డి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి ఎడమ చేతికి వెండి కడియం, చాతిపై కుడివైపున పుట్టుమచ్చ ఉన్నాయని రైల్వే పోలీసులు తెలిపారు. ఆనవాళ్లు తెలిసినవారు రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.
Similar News
News November 24, 2025
ప్రకాశం: పేకాట ఆడేవారిని పట్టించిన వ్యక్తికి రూ.67వేల రివార్డ్.!

ప్రకాశం జిల్లా గిద్దలూరులో పేకాట ఆడిన ఆరుగురికి గిద్దలూరు కోర్టు న్యాయమూర్తి భరత్ చంద్ర 2రోజుల జైలు శిక్ష విధించారు. నిందితుల వద్ద నుంచి రూ.1,35,000 స్వాధీనం చేసుకున్నారు. అందులోని రూ.67,500 నగదు పేకాట ఆడుతున్నవారిని పట్టించిన వ్యక్తికి రివార్డుగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, అలా ఎవరైనా ఆడితే పోలీసులకు తెలపాలన్నారు.
News November 24, 2025
నెమ్లి: రెజ్లింగ్లో నేషనల్ లెవెల్కి ఎంపిక

నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో గల నెమ్లికి చెందిన నిహారిక అనే విద్యార్థిని రెజ్లింగ్ విభాగంలో నేషనల్ లెవెల్కి ఎంపికైనట్టు స్కూల్ హెడ్ మాస్టర్ బాలరాజు తెలిపారు. శనివారం హైదరాబాద్లో స్టేట్ లెవెల్లో గెలుపొందిన నేపథ్యంలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెడల్ తీసుకున్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ నిహారికను సన్మానించి నేషనల్ లెవెల్లో కూడా గెలవాలని అభినందించారు.
News November 24, 2025
పెద్దపల్లి: ‘కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి’

కార్మిక సామాజిక భద్రత పథకాలపై అవగాహన సదస్సుల పోస్టర్ అదనపు కలెక్టర్ దాసరి వేణు కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ-శ్రమ్ పోర్టల్ లో నిర్మాణ కార్మికులు తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3 వరకు కార్మిక సంక్షేమంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుల కోసం పెద్దపల్లి 9492555258, మంథని 9492555248, గోదావరిఖని 9492555284 కార్మిక అధికారులను సంప్రదించాలని సూచించారు.


