News January 28, 2025
కామారెడ్డి: ‘రోడ్డు నిబంధనలు పాటించాలి’

ప్రతి ఒకరూ రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలన్నారు. ఎంతోమంది హెల్మెట్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
Similar News
News December 9, 2025
కలెక్టర్ సార్.. శ్రీకాళహస్తిలో శ్మశానాన్నీ వదలడం లేదు..!

శ్రీకాళహస్తిలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇక్కడి ఇసుకకు గిరాకీ ఎక్కువగా ఉండడంతో చెన్నైకు లారీలతో తరలిస్తున్నారు. శుకబ్రహ్మ ఆశ్రమం వద్ద మొదలు పెడితే తొట్టంబేడు చివరి వరకు ఎక్కడో ఒకచోట ఇసుక తవ్వతూనే ఉన్నారు. చివరకు శ్మశానంలో సైతం తవ్వకాలు చేస్తున్నారు. మనిషి అస్తిపంజరాలను సైతం తవ్వేసి ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై తిరుపతి కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
News December 9, 2025
ఖమ్మం: రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమీక్ష

ఖమ్మం జిల్లాలోని రైస్ మిల్లర్లకు వరి ధాన్యం కేటాయింపు చేసేందుకు బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చూపించడం తప్పనిసరి అని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో రైస్ మిల్లర్ల తో ధాన్యం కేటాయింపు, బ్యాంక్ గ్యారంటీ, పెండింగ్ సీఎంఆర్ రైస్ డెలివరీపై సమీక్ష జరిగింది. రైస్ మిల్లులు అందజేసిన బ్యాంకు గ్యారంటీ ఆధారంగా కేటాయింపు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
News December 9, 2025
ఎన్నికల పోలింగ్ రోజు సెలవు: కలెక్టర్

జిల్లాలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, పోలింగ్ జరిగే ఆయా మండలాల్లో స్థానిక సెలవు ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రకటించారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో ఈ స్థానిక సెలవులను ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.


