News January 11, 2026
కామారెడ్డి: రోడ్డు నిబంధనలు పాటించాలి

వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు వాహన డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. రోడ్డు నిబంధనలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు పలు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.
Similar News
News January 14, 2026
ట్రాఫిక్ జామ్ ఇక గతం: భాగ్యనగరంలో త్వరలో నయా ‘హైవే’ మ్యాజిక్!

బండి బయటకు తీస్తే చాలు.. గంటల తరబడి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నరకాన్ని చూస్తున్న ఐటీ కారిడార్ వాసులకు ఇక ఆ ఇబ్బందులు తీరినట్లే! హైటెక్ సిటీ, మాదాపూర్, గోల్కొండ నుంచి ORR వరకు రోడ్ల రూపురేఖలను మార్చేందుకు HMDA సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. కేవలం రోడ్లే కాదు, పాదచారుల కోసం ఆకాశ మార్గాలు (Sky walks), వాహనాల కోసం భారీ ఫ్లైఓవర్లతో 2050 నాటి అవసరాలకు తగ్గట్టుగా నగరాన్ని తీర్చిదిద్దబోతున్నారు.
News January 14, 2026
సంక్రాంతి పురుషుడి గురించి తెలుసా?

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో గోచరించే రూపమే ‘సంక్రాంతి పురుషుడు’. ప్రతి ఏడాది ఆయన ఓ ప్రత్యేక వాహనంపై, విభిన్న వస్త్రాలు, ఆభరణాలతో వస్తాడని పంచాంగం చెబుతుంది. ఆయన ధరించే వస్తువులు, చేసే పనులను బట్టి ఆ ఏడాది దేశంలో వర్షాలు, పంటలు, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ మార్పులు ఎలా ఉంటాయో జ్యోతిషులు అంచనా వేస్తారు. సంక్రాంతి పురుషుడి ఆగమనం ప్రకృతిలో వచ్చే మార్పులకు, భవిష్యత్తుకు సూచికగా భావిస్తారు.
News January 14, 2026
కరీంనగర్ జిల్లాలో 2,292 టన్నుల యూరియా నిల్వలు

కరీంనగర్ జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. గత 15 రోజుల్లో వివిధ సొసైటీల ద్వారా 8,124 మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 2,292 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, అవసరానికి అనుగుణంగా అదనపు స్టాక్‌ను తెప్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.


