News January 11, 2026
కామారెడ్డి: రోడ్డు నిబంధనలు పాటించాలి

వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు వాహన డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. రోడ్డు నిబంధనలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు పలు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.
Similar News
News January 24, 2026
నగరి:సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే..

నగరిలో సీఎం చంద్రబాబు శనివారం పర్యటించనున్నారు. 11. 20 గంటలకు నగరిలోని హెలిప్యాడ్‌కి చేరుకుని 11:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. 1.50 గంటలకు హాస్టల్ తనిఖీ చేస్తారు. 2.15 గంటలకు ఏరియా ఆసుపత్రికి చేరుకుంటారు. అనంతరం 2.40 గంటలకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. ఆయన పర్యటన కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
News January 24, 2026
ఫిరంగిపురంలో చెత్త సంచిలో చిన్నారి

ఫిరంగిపురంలో కనిపించిన ఈ దృశ్యం నిజంగానే గుండెను బరువెక్కించేలా ఉన్నాయి. ‘లోకమంతా బడి బాట పడుతుంటే.. ఈ చిన్నారి మాత్రం చెత్త సంచిలో’ ఒదిగిపోయాడు. రిక్షా వెనుక వేలాడుతున్న ఆ సంచే ఆ పసివాడికి ఊయల అయ్యింది. రేపటి పౌరుడిగా ఎదిగాల్సిన వయసులో, చెత్త కుప్పల మధ్య తన భవిష్యత్తును వెతుక్కుంటున్న ఆ చిన్నారి చూపులు సమాజాన్ని నిలదీస్తున్నట్లుగా ఉన్నాయి.
News January 24, 2026
విశాఖ: చదువుకున్న వారే మోసపోతున్నారు..

చదువుకున్న వారే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులే ఉన్నారు. తాజాగా నగరంలోని ఓ రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి సైబర్ ముఠా రూ.10 లక్షల వరకు కాజేశారు. ఈ కేసులో విశాఖ సైబర్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వరంగల్ ప్రాంతానికి చెందిన రమేశ్, పరుశురాములు, నిశాంత్ కలిసి ఓ వ్యక్తి అకౌంట్ తీసుకుని సైబర్ క్రైమ్ ముఠాకు కమిషన్ రూపంలో అప్పజెప్పినట్లు దర్యాప్తులో తేలింది.


