News January 10, 2026
కామారెడ్డి: రోడ్డు నిబంధనలు పాటించాలి

వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు వాహన డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. రోడ్డు నిబంధనలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు పలు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.
Similar News
News January 17, 2026
NGKL: 15 మంది ల్యాబ్ టెక్నీషియన్‌ల నియామకం

నాగర్ కర్నూల్ జిల్లాలో 15 మంది నూతన ల్యాబ్ టెక్నీషియన్‌లకు విధుల నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.కే.రవికుమార్ శనివారం వివిధ PHCలలో విధులు చేపట్టేందుకు ఉత్తర్వులు అందజేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ల్యాబ్ టెక్నీషియన్‌ల కొరత తీరడంతో మూత్ర, రక్త పరీక్షలు మెరుగవుతాయని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేందుకు నూతన ఉద్యోగులు కృషి చేయాలని ఆయన సూచించారు.
News January 17, 2026
మేడారం మహాజాతర.. ప్రధాన ఘట్టాలు!

TG: మేడారం మహాజాతర మరో 11 రోజుల్లో ప్రారంభం కానుంది. ముఖ్య కార్యక్రమాల వివరాలు ఇలా..
* ఈ నెల 28(బుధవారం) సాయంత్రం 4 గంటలకు సారలమ్మ గద్దెకు వచ్చే సమయం
* 29(గురువారం) సాయంత్రం 5 గంటలకు సమ్మక్క గద్దెకు వచ్చే సమయం
* 30(శుక్రవారం) అమ్మవార్లకు మొక్కులు చెల్లించుట
* 31(శనివారం) సాయంత్రం 4 గంటలకు సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం
** ఈ నెల 19న సీఎం రేవంత్ గద్దెల పునరుద్ధరణ ప్రారంభోత్సవం చేస్తారు.
News January 17, 2026
MBNR: చూచిరాతకు పాల్పడితే చర్యలు తప్పవు: కె.ప్రవీణ

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఫార్మసీ కాలేజీలో కొనసాగుతున్న బీ-ఫార్మసీ V &VII సెమ్ పరీక్షలను పరీక్షల నియంత్రణ అధికాణి డాక్టర్ కే.ప్రవీణ పరిశీలించారు. చూచిరాతకు పాల్పడితే చర్యలు తప్పవని, అదేవిధంగా పరీక్ష హాలులో ఏమైనా సమస్యలుంటే చీప్ సూపరింటెండెంట్ దృష్టికి తేవాలని అన్నారు. చీప్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కాంత్ పాల్గొన్నారు.


