News February 17, 2026

కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఉప్పల్‌వాయి యువకుడు మృతి

image

రామారెడ్డి మండలం ఉప్పల్‌వాయి గ్రామానికి చెందిన జంగిటి రాజు మంగళవారం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పని నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా వెన్నెల డిబేట్ సమీపంలో బైక్‌ను కారు ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News March 17, 2026

కరీంనగర్: కాలువలో గల్లంతైన ప్రభుత్వ ఉద్యోగి మృతి

image

కరీంనగర్(D) కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద కాలువలో గల్లంతైన ప్రభుత్వ ఉద్యోగి రాచకొండ లచ్చయ్య (55) మృతదేహం లభ్యమైంది. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆయన, ఆదివారం స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. ఒడ్డున దుస్తులు, బైక్ గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టగా చింతకుంట శివారులో మృతదేహం దొరికింది. భార్య పద్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 17, 2026

కానాయిపల్లిలో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

వనపర్తి జిల్లాలో 21 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాలలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా కానాయిపల్లిలో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మదనపూర్ 38.2, వెలుగొండ 37.4, వీపనగండ్ల 37.2, పెద్దమందడి, దగడ 36.9, ఆత్మకూరు, వనపర్తి 36.3, అమరచింత, జానంపేట 35.8, శ్రీరంగాపూర్ 35.5, పానగల్, రేమద్దుల, పెబ్బేరు, ఘన్‌పూర్ 35.3, విలియంకొండ 35.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 17, 2026

మెదక్: అసెంబ్లీ సెక్రటరీకి వాయిదా తీర్మానం ఇచ్చిన హరీశ్ రావు

image

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. మాజీ మంత్రి హరీశ్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీకి తీర్మానం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, జీపీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు రాక రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.