News October 18, 2024

కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా శంకరంపేట్ శివారులో జాతీయ రహదారి-161పై జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్నకొడప్గల్ వాసి సాయి గురువారం అమ్మతో కలిసి బైక్‌పై శంకరంపేట్‌కు వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. ట్రాక్టర్‌ను ఢీకొన్నాడు. చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలాడు.

Similar News

News February 28, 2026

NZB: విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం: కలెక్టర్

image

విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా పంపిణీ చేపట్టగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్యార్జనను కొనసాగించాలని హితవు పలికారు.

News February 28, 2026

నవీపేట్‌: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

image

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.