News December 24, 2024
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి

రాయదుర్గం PS పరిధిలో శివాని అనే యువతి సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. CBITలో బీటెక్ 4వ ఏడాది చదువుతున్న శివాని KMR జిల్లా నిజాంసాగర్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి వచ్చింది. హాస్టల్‌కు వెళ్లేందుకు స్నేహితుడు వెంకట్ రెడ్డి బైక్ పై ఎక్కి నార్సింగి సర్వీస్ రోడ్డులో వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో శివాని మృతిచెందగా వెంకట్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News April 19, 2026
SRSP ఆస్తుల జప్తునకు రంగారెడ్డి కోర్టు ఆదేశాలు

SRSP కాకతీయ కాల్వ పనుల బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన నీటిపారుదల శాఖపై రంగారెడ్డి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంకటేశ్వర ఇంజినీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ చేసిన రూ.16కోట్ల పనుల బిల్లుల పెండింగ్‌పై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ కార్యాలయంలో రూ.50 లక్షల విలువైన ఫర్నిచర్, 24 ఏసీలు, 2 కార్లు జప్తు చేయాలని న్యాయమూర్తి శనివారం ఆదేశాలు జారీ చేశారు.
News April 19, 2026
నిజామాబాద్ ఏఎస్పీగా శుభం ప్రకాశ్

నిజామాబాద్ ఏఎస్పీగా శుభం ప్రకాశ్ నియమితులయ్యారు. వరంగల్ ఏసీపీగా ఉన్న శుభం ప్రకాశ్‌ను అడిషనల్ ఎస్పీగా నిజామాబాద్‌కు బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని వార్ధా జిల్లా. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
News April 18, 2026
NZB: సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించే సంక్షేమ వారోత్సవాలను సంబంధిత అధికారులు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్‌లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ సూచించారు. శనివారం వారు మాట్లాడుతూ.. సంక్షేమ శాఖల అధికారులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు వారోత్సవాలను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.


