News March 25, 2025
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కొట్టాలకు చెందిన బోదాటి సాయవ్వ(43) రైలు దిగి రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Similar News
News October 20, 2025
నల్గొండ: ఇద్దరు బిడ్డలను చంపి తల్లి సూసైడ్

కొండమల్లేపల్లిలో దారుణం జరిగింది. భార్యాభర్తల గొడవలతో మనస్తాపం చెందిన నాగలక్ష్మి (27) తన ఇద్దరు బిడ్డలు భవన్ సాయి (7), అవంతిక (9)ను హతమార్చి అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కొండమల్లేపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 20, 2025
ఈ-పంట నమోదు గడువు ఈ నెల 30 వరకు పొడిగింపు

APలో ఖరీఫ్ పంటల ఈ-క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. సర్వే చేయడానికి వీలులేని కాలువలు, రోడ్లు, ఆక్వా-వ్యవసాయేతర భూములను సర్వే నుంచి మినహాయించారు. e-cropలో భాగంగా రైతు ఆధార్, ఫోన్ నంబర్, భూమి, పాస్ బుక్‌తో పాటు రైతుల ఫొటోలను ఈ-పంట యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ-క్రాప్‌లో నమోదైన రైతుల నుంచే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తుంది. వీరికే పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ వర్తిస్తుంది.
News October 20, 2025
మాలేపాటి మృతిపై మంత్రి లోకేశ్ సంతాపం

APఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. ‘పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన సుబ్బానాయుడు కావలి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా పనిచేశారు. పార్టీ పటిష్టత కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. వారి మరణం పార్టీకి తీరని లోటు. సుబ్బానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’. అని అన్నారు.