News April 11, 2025

కామారెడ్డి: రోడ్డు ప్రమాదం.. పరిస్థితి విషమం

image

పెద్ద కొడప్గల్ మండలంలో గురువారం రాత్రి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద కొడప్గల్‌కు చెందిన కమ్మరి పండరి(65) అంజని గ్రామంలో సప్తహ ముగించుకుని సుమారు రాత్రి 10 గంటలకు ఇంటికి వస్తున్న సమయంలో పెద్ద కొడప్గల్ శివారులో రహదారిపై ధాన్యం కుప్ప వల్ల ప్రమాదానికి గురయ్యారు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.

Similar News

News December 4, 2025

ఆదిలాబాద్‌కు ఎయిర్‌‌బస్ తెస్తాం: CM రేవంత్

image

TG: అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని CM రేవంత్ పేర్కొన్నారు. ‘ఆదిలాబాద్‌కూ ఎయిర్‌పోర్టు కావాలని MLA పాయల్ శంకర్ నాతో అన్నారు. ఇదే విషయం నిన్న ఢిల్లీలో PM మోదీతో మాట్లాడాను. సంవత్సరం తిరిగేలోగా ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తాం. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న ప్రాంతంలో ఎయిర్‌బస్ తీసుకొచ్చి.. కంపెనీలు నెలకొల్పే బాధ్యత తీసుకుంటున్నా’ అని తెలిపారు.

News December 4, 2025

నెల్లూరులో వరినాట్లు కళ్ల ముందే కొట్టుకుపోతున్నాయ్..!

image

నెల్లూరు జిల్లాలోని వరి నాట్లు కళ్ల ముందే కొట్టుకుపోతున్న దయనీయ పరిస్థితి నెలకొంది. జిల్లాలో 11 మండలాల పరిధిలోని 71 గ్రామాల్లో 1,169 హెక్టార్లలో నాట్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. 1,775 మంది రైతులు నష్ట పోయారన్నారు. భారీ వర్షాల వల్ల బోగోలు, విడవలూరు, కొడవలూరు, నెల్లూరు రూరల్, కావలి, కోవూరు, అల్లూరు, వెంకటాచలం, బుచ్చి, సంగం, మనుబోలు మండలాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.

News December 4, 2025

డెస్క్ వర్క్ చేసే వాళ్లకి ఫ్రోజెన్ షోల్డర్ ముప్పు

image

నేడు చాలా మందిని వేధిస్తున్న సమస్య ఫ్రోజెన్ షోల్డర్. చేతిని పైకి ఎత్తినా, కాస్త వేగంగా కదిలించినా నొప్పి వస్తుంది. పడిపోవడం, దెబ్బ తగలడం లేదా ఎక్సర్‌సైజులు చేయడం వల్ల అలా జరిగిందని అనుకుంటారు. డెస్క్‌లో కూర్చుని పనిచేసే వాళ్లకు ఫ్రోజెన్ షోల్డర్ ముప్పు ఎక్కువని సర్వేలో తేలింది. డయాబెటిస్, హైపోథైరాయిడిజం, గుండె జబ్బుల బాధితులకు ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువ. దీనిని అథెసివ్ క్యాప్సులైటిస్ అంటారు.