News April 11, 2025
కామారెడ్డి: రోడ్డు ప్రమాదం.. పరిస్థితి విషమం

పెద్ద కొడప్గల్ మండలంలో గురువారం రాత్రి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద కొడప్గల్‌కు చెందిన కమ్మరి పండరి(65) అంజని గ్రామంలో సప్తహ ముగించుకుని సుమారు రాత్రి 10 గంటలకు ఇంటికి వస్తున్న సమయంలో పెద్ద కొడప్గల్ శివారులో రహదారిపై ధాన్యం కుప్ప వల్ల ప్రమాదానికి గురయ్యారు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.
Similar News
News April 17, 2026
వికారాబాద్: జోరుగా ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమాలు

వికారాబాద్ జిల్లాలో ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజును ‘చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డే’గా నిర్వహించి, విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీటు బెల్ట్ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ పాఠశాలల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. రహదారి భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
News April 17, 2026
సుబేదారి: ఎస్సైపై అత్యాచారం కేసు

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శ్రీకాంత్‌పై అత్యాచారం కేసు నమోదైంది. కరీంనగర్ కమిషనరేట్‌లో పని చేస్తున్న ఆయన, 2025లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మహిళతో చాటింగ్ కొనసాగించాడు. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకొని, ఇటీవల వరంగల్‌కు వచ్చి లొకేషన్ అడిగి ఇంటికి వెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 17, 2026
యుద్ధం.. ఏవియేషన్‌కు ₹18,000 కోట్ల నష్టం!

ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ భారత విమానయాన రంగానికి గట్టిగా తగులుతోంది. సుమారు ₹18,000 కోట్ల మేర భారీ నష్టాన్ని చవిచూడబోతోందని PHDCCI నివేదిక అంచనా వేసింది. విమాన మార్గాల మళ్లింపుతో జర్నీ టైమ్ 4 గంటల వరకు పెరగడమే కాకుండా, ఇంధన ఖర్చులు తడిసి మోపెడవడం అందుకు కారణం. మరోవైపు భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా 20% వరకు పడిపోయే ప్రమాదం ఉన్నట్లు నివేదిక పేర్కొంది.


