News August 7, 2024

కామారెడ్డి: ర్యాగింగ్, ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

image

విద్యాసంస్థలలో ఇతర ప్రాంతాల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లాలోని అన్ని కళాశాలలు, విద్యాలయాలు ప్రారంభమైన నేపథ్యంలో ఫ్రెషర్స్ పార్టీ అని కొత్తగా వచ్చిన విద్యార్థులను, సీనియర్ విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా అవమానించడం, బెదిరించడం, భయబ్రాంతులకు గురిచేయడం లాంటివి గతములో జరిగేవని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

Similar News

News September 10, 2024

బోధన్: ‘రూ.20వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలి’

image

గత నెల రోజులకు కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20వేలు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. బోధన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలని, రైతు బందు పెట్టుబడి సాయం అందజేయాలని అన్నారు. కార్యక్రమంలో మేకల మల్లేష్, సాయిబాబా, రాజయ్య, గోపి, తదితరులు పాల్గొన్నారు.

News September 10, 2024

నందిపేటలో రక్షణ కోసం రాళ్లు పట్టిన మహిళలు

image

నందిపేటలో ఒకే రోజు వరుసగా పది మందిని పిచ్చి కుక్క విచక్షణారహితంగా కరిచి తీవ్ర గాయాలపాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మండల కేంద్రంలోని మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, తమ పనుల నిమిత్తం ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే తమ రక్షణ కోసం రాళ్లు పట్టుకొని వెళ్లే దుస్థితి ఎదురయ్యింది. కుక్క వచ్చి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి ఉందని ఏదైనా పనుల నిమిత్తం బయటకు వెళ్ళడానికి భయంగా ఉందని అంటున్నారు.

News September 9, 2024

KMR: జిల్లాలో 5.43 లక్షల ఎకరాల్లో పంటలు

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్లో 5.43 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేస్తున్నట్లు వ్యవసాయ అధికారుల లెక్కల్లో తేలింది. ప్రస్తుత వానకాల సీజన్ ఆరంభమైన తర్వాత తొలకరి జల్లులే.. ఆలస్యమైనా ఇటీవల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దీంతో వరి, పత్తి, కంది, సోయాబీన్ పంటలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కాగా ఎప్పటిలాగే ఈ సారి కూడా వరి స్థానంలో ఇతర పంటల సాగుకు ప్రత్యామ్నాయం కరువైంది.