News March 19, 2025

కామారెడ్డి: లేఅవుట్ ప్లాట్ల అనుమతులపై నివేదికలు సమర్పించాలి: కలెక్టర్

image

లే అవుట్లు, ప్లాట్ల అనుమతులకు సంబంధిత శాఖల అధికారులు నివేదికలు స్పష్టంగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో TG బి -పాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో లే అవుట్లు, ప్లాట్ల అనుమతులకు ఆయా శాఖల అధికారుల నివేదికలను సమర్పించాలన్నారు. ఆయా లే అవుట్లు సంబంధిత అధికారులు పరిశీలించి పూర్తి నివేదికలు అందజేయాలన్నారు.

Similar News

News September 13, 2025

నేడు విజయనగరం కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ

image

విజయనగరం జిల్లా కొత్త కలెక్టర్‌గా నియమితులైన ఎస్.రామసుందర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో అధికారికంగా బాధ్యతలు చేపడతారు. ఇప్పటివరకు ఆయన రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కమిషనర్‌గా, సీడీఏ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. పూర్వ కలెక్టర్ అంబేడ్క‌ర్‌కు బదిలీ కాగా ఇంకా పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.

News September 13, 2025

తిరుమలలో మొబైల్ ఫోన్ల దొంగ అరెస్టు

image

తిరుమలలో శ్రీవారి భక్తుల మొబైల్ ఫోన్లను దొంగలించే దొంగను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.3.5 లక్షల విలువ గల 15 మొబైల్ ఫోన్లు, 20 గ్రా. బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. భక్తుడి ముసుగులో తరచుగా తిరుమల వస్తూ సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు దొంగిలించే వాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన మెట్టు కిశోర్ రెడ్డిగా గుర్తించారు. ఈ మేరకు అతడిని రిమాండ్‌కు తరలించారు.

News September 13, 2025

పార్వతీపురం: గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తాం

image

గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తామని జిల్లా ప్రజా రవాణాధికారి పి.వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ప్రజా రవాణాధికారి కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ ప్రజా రవాణాధికారి కార్యక్రమానికి 26 వినతులు వచ్చాయి. ఉన్నతాధికారులను సంప్రదించి సాధ్యమైనంత వరకూ పల్లెలకు, చివరి గ్రామాలకు బస్సు సౌకర్యం, స్టాపుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.