News January 31, 2025

కామారెడ్డి: వచ్చే నెల 1న జాబ్‌మేళా

image

కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో వచ్చే నెల 1న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మధుసూధన్ రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కామారెడ్డిలోని ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, SSC ఆపై చదివిన 18 నుంచి 30 ఏళ్ల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

Similar News

News February 9, 2025

BJPని గెలిపించాలి: MLA హరీశ్ బాబు

image

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు కోరారు. కాగజ్‌నగర్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీకి  అందివచ్చిన అవకాశమని అన్నారు. బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.

News February 9, 2025

కరప: పాత కక్షలతో వ్యక్తిపై కత్తితో దాడి

image

కరప మండలం కురాడకు చెందిన కేదాసి సూరిబాబు జి. బావారం వద్ద ఫోన్‌లో మాట్లాడుతుండగా మేడపాటి శ్రీనివాసరావు ఆటోలో వచ్చి సూరిబాబు పై కత్తితో దాడి చేయగా అతని ఎడమచేతి బొటన వేలు తెగిపడిపోయింది. భయంతో బాధితుడు సూరిబాబు పారిపోయాడు. అనంతరం నిందితుడు శ్రీనివాసరావు కత్తినక్కడ వదిలేసి ఆటోలో వెళ్లిపోయాడు. స్థానికులు క్షతగాత్రుడుని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని ఎస్సై సునీత తెలిపారు.

News February 9, 2025

చైతూని చూసి గర్విస్తున్నా: నాగార్జున

image

తన కొడుకు నాగచైతన్య‌ను చూసి గర్విస్తున్నట్లు అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. ‘తండేల్’ కేవలం సినిమా మాత్రమే కాదని, చైతూ డ్రీమ్, కృషికి నిదర్శనమని కొనియాడారు. ఈ చిత్రాన్ని అందించిన అల్లు అరవింద్, బన్నీ వాస్, దర్శకుడు చందూ మొండేటికి ధన్యవాదాలు తెలియజేశారు. తమ కుటుంబానికి మద్దతుగా ఉన్న అక్కినేని అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

error: Content is protected !!