News January 31, 2025

కామారెడ్డి: వచ్చే నెల 1 న జాబ్ మేళా

image

కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో వచ్చే నెల 1న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మధు సూధన్ రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కామారెడ్డిలోని ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, SSC ఆపై చదివిన 18 నుంచి 30 ఏళ్ల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

Similar News

News December 4, 2025

జీవీఎంసీలో విలీనం కానున్న గ్రామీణ మండలాలివే..!

image

ఉమ్మడి విశాఖ జిల్లా విభజన అనంతరం మిగిలిపోయిన 4 మండలాలైన ఆనందపురం, పద్మనాభం, భీమిలి, పెందుర్తిని GVMCలో విలీనం చేసే ప్రక్రియ జరుగుతోంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని 3 గ్రామీణ మండలాలు (భీమిలి, పద్మనాభం, ఆనందపురం) GVMCలో కలిపేందుకు CM చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, నారాయణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. దీంతో GVMC పరిధి విస్తరణతో పాటు వార్డులు కూడా పెరగనున్నాయి.

News December 4, 2025

ఏయే పూజలకు ఏ సమయం అనుకూలం?

image

పౌర్ణమి తిథి నేడు ఉదయం 8.37AMకి ప్రారంభమై, రేపు తెల్లవారుజామున 4.43AMకి ముగుస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజు చేసే ఏ పూజలైనా, వ్రతాలైనా ఈ సమయంలో చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. నేడు ఉదయం 6.59AM – 2.54PM మధ్యలో రవి యోగం ఉంటుందని, ఈ సమయంలో పవిత్ర స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని అంటున్నారు. లక్ష్మీ, సత్యనారాయణ వ్రతాలతో పాటు శివాభిషేకం, ఇతర పూజలు ప్రదోష కాలంలో చేయాలంటున్నారు.

News December 4, 2025

అమరావతిలో 2వ దశ పూలింగ్.. ప్రభుత్వ భూమి ఎంత ఉందంటే.?

image

అమరావతి రాజధాని నిర్మాణానికి 2వ దశ పూలింగ్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా నుంచి 7,464 ఎకరాల పట్టా భూమి, 97 ఎకరాల అసైన్డ్ భూమిని పూలింగ్‌కు తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ కాగా.. ప్రభుత్వ భూమి మరో 2054.23 ఎకరాల ఉంది. గుంటూరు(D) తుళ్లూరు మండలంలోని మిగిలిన గ్రామాల్లో 9097.56 ఎకరాల పట్టా భూమి, 7.01 అసైన్డ్ భూమి కాగా ప్రభుత్వ భూమి 1774.07 ఏకరాలుగా ఉత్తర్వుల్లో ఉంది.