News February 13, 2025
కామారెడ్డి: వాలంటైన్స్డే బజరంగ్దళ్, వీహెచ్పీ హెచ్చరిక

కామారెడ్డి జిల్లాలో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా భజరంగ్దళ్, వీహెచ్పీ కార్యకర్తలు కీలక ప్రకటన చేశారు. పాశ్చాత్య దేశాల సంప్రదాయాలు ప్రభావం మనదేశంలో పడకుండా చూడాలని కోరారు. ప్రేమ ముసుగులో వికృత చేష్టలు చేపడుతున్న యువతకు కళ్ళు తెరిపించి మంచి బుద్ధితో ఉండాలని సూచించారు. దేశ సేవకు ముందుకు రావాలని కోరారు. యువత, స్టూడెంట్ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టడానికి వీలుండదని హెచ్చరించారు.
Similar News
News November 24, 2025
సచివాలయంలో బ్లాక్ షీప్స్..

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనే సామెత ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం కొందరు సీనియర్ ఐఏఎస్లు BRSకు ముఖ్య సమాచారం లీక్ చేస్తున్నారనే ఆరోపణలు. రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలు, డ్రాఫ్ట్ దశలోని రిపోర్టుల్లోని కీలక అంశాలను పాత ప్రభుత్వ ముఖ్య నేతలకు చేరవేస్తున్నారట. దీంతో ఆ బ్లాక్ షీప్స్ ఎవరో తెలుసుకునే పనిలో ఇంటలిజెన్స్ ఉందని విశ్వసనీయ వర్గాలు Way2Newsకు తెలిపాయి.
News November 24, 2025
కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటున్నారా?

కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది అనారోగ్యకరం అంటున్నాయి కొన్ని అధ్యయనాలు. ఇలా కూర్చోవడం వల్ల రక్తపోటు పెరగడంతో పాటు, వెరికోస్వెయిన్స్ సమస్యలు వస్తాయి. గర్భిణులు ఇలా కూర్చుంటే కండరాల ఒత్తిడి, వెన్నునొప్పి, తిమ్మిర్లు, చీలమండ వాపు వంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ఎక్కువసేపు ఇలా కూర్చోవడం వల్ల పోశ్చర్ కూడా మారిపోతుందని హెచ్చరిస్తున్నారు.
News November 24, 2025
అన్ని రికార్డుల్లోనూ జిల్లా పేరు మార్పు: జేసీ

అన్ని ప్రభుత్వ పత్రాల్లో ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా’ పేరును చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తున్నట్లు జేసీ టి.నిశాంతి తెలిపారు. ఇప్పటికే పౌరసరఫరాల శాఖలో ఈ మార్పు జరిగిందని, మిగిలిన శాఖల్లోనూ పూర్తిస్థాయిలో పేరు మారేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొంత సమయం పడుతుందని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఆమె కోరారు.


