News September 13, 2025

కామారెడ్డి విజయ డైరీని సందర్శించిన వాకిటి శ్రీహరి

image

కామారెడ్డిలోని విజయ డైరీని మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. పాల సేకరణలో విజయ డైరీ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవాలని సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. పాడుబడ్డ భవనాలను తొలగించి ఆధునిక సదుపాయాలతో కొత్త నిర్మాణాలను చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్శనలో అధికారులతో చర్చించి అవసరమైన మార్పులు చేపట్టాలని సూచించారు.

Similar News

News March 3, 2026

పుత్తూరు : వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి

image

వడదెబ్బ కారణంగా వ్యక్తి మృతి చెందిన ఘటన పుత్తూరు పట్టణంలో జరిగింది. స్థానిక జెండామాను విధికి చెందిన పార్దిపన్ (45) కొన్ని రోజులుగా అరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సోమవారం చిత్తూరు నుంచి పుత్తూరుకు బస్సులో ప్రయాణించే సమయంలో పుత్తూరుకు రాగానే అస్వస్థతకు గురయ్యారు. 108 సిబ్బంది చేరుకొని చూడగా అప్పటికే మృతి చెందారు. అనారోగ్యంతో పాటు, ఎండ కారణంగా మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

News March 3, 2026

జనగామ: పట్టిస్తే రూ.10 వేలు.. ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా!

image

జిల్లాలోని పలు గ్రామాలు స్వచ్ఛంద మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. బచ్చన్నపేట మండలం కొడవటూర్, చిన్నరామన్ చర్ల, లింగంపల్లి, రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్‌లో మద్యపాన నిషేధ తీర్మానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే తీర్మానాన్ని ఉల్లంఘించి మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా, తాగిన వారిని, అమ్మినవారిని పట్టించిన వారికి రూ.10 వేలు నజరానా ప్రకటించి కఠినంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాయి.

News March 3, 2026

అనంత: బైక్ కొనివ్వలేదని సూసైడ్

image

బైక్ కొనివ్వలేదని క్షణికావేశంలో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తాడిపత్రి మండలం చల్లవారిపల్లి సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. మృతుడు టైలర్స్ కాలనీకి చెందిన నాగేంద్ర, కళావతి దంపతుల కుమారుడు సాయికిరణ్‌(21)గా రైల్వే పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.