News February 11, 2025
కామారెడ్డి: విద్యాశాఖ మంత్రిని నియమించాలి: SFI

రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజినీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డిలో జిల్లా ఎస్ఎఫ్ఐ ఐదో మహాసభ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముదాం అరుణ్, నాయకులు రాహుల్, నితిన్ మణికంఠ, నవీన్ ఉన్నారు.
Similar News
News September 18, 2025
చింతపల్లి: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

చింతపల్లి మండలం లంబసింగి ఘాట్ రోడ్డులో గురువారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. లంబసింగి పంచాయతీ వార్డు మెంబర్, శివాలయం అర్చకుడు వాడకాని రాజ్కుమార్ (35) నర్సీపట్నం వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఘాట్ 2వ మలుపులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని తెలిపారు.
News September 18, 2025
మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దు: వరంగల్ పోలీసులు

సోషల్ మీడియా ద్వారా బంపర్ ఆఫర్లు, బహుమతుల పేరిట వస్తున్న మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని వరంగల్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటూ వచ్చే లింకులు, స్పిన్ వీల్ లేదా స్క్రాచ్ కార్డుల పేరుతో వచ్చే సందేశాలు పూర్తిగా మోసపూరితమని అధికారిక ఫేస్బుక్ పేజీ ద్వారా ప్రజలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు.
News September 18, 2025
జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

AP: జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పన్నుల విధానంతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. పన్నుల విధానంలో 2 శ్లాబులు (5%,18%) మాత్రమే ఉంచి సరళతరం చేశారని పేర్కొన్నారు.