News August 19, 2024
కామారెడ్డి: విరాళాలతో ప్లాట్‌ఫాం నిర్మించుకున్న గ్రామస్థులు

బిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామస్థులు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని చూడకుండా విరాళాలు పోగు చేసుకుని సొంతంగా 19 ఏళ్ల క్రితం రైల్వే ప్లాట్‌ఫాం నిర్మించుకున్నారు. ఒక్కొక్కరికీ రూ.25 చొప్పున జమచేసుకున్నారు. వివిధ సంఘాల నుంచి విరాళాలు స్వీకరించారు. అంతేగాక టికెట్లు ఇవ్వడంతో పాటు రైళ్ల సమాచారం తెలిపేందుకు తాత్కాలిక ఉద్యోగిని కూడా నియమించుకున్నారు. రైళ్లు ఆ ప్లాట్‌ఫాంపై ఆగేలా చేశారు.
Similar News
News October 24, 2025
NZB జిల్లాలో మద్యం దరఖాస్తులు ఎన్నంటే..?

మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగియగా జిల్లాలోని 102 షాపులకు గానూ 2,786 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఒక్కో టెండర్‌కు రూ.3 లక్షల చొప్పున రూ.83.58కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గత టెండర్లలో 3,759 దరఖాస్తులు రాగా.. ఈసారి టెండర్లను రూ.3 లక్షలకు పెంచడంతో దరఖాస్తులు తగ్గాయి. కాగా ఈ నెల 27న భారతి గార్డెన్లో మద్యం దుకాణాల కేటాయింపు కోసం లక్కీ డ్రా నిర్వహించనున్నారు.
News October 24, 2025
NZB: 138 పేకాట కేసుల్లో 599 మంది పట్టివేత:CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 19 నుంచి 22 వరకు 138 పేకాట కేసులు నమోదు చేసి 599 మందిని పట్టుకున్నట్లు CP సాయి చైతన్య గురువారం తెలిపారు. ఈ కేసుల్లో రూ. 14,15,917 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. NZBడివిజన్లో 42 కేసులు, ARMRడివిజన్లో 44 కేసులు, బోధన్ డివిజన్ లో 52 కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
News October 23, 2025
సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలి: కవిత

తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష నియామకాల్లో టీజీపీఎస్సీ… రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆర్టికల్ 371-డి ని ఉల్లంఘించిందంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోని విచారించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌కు ఆమె లేఖ రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం చేసిందన్నారు.


