News August 19, 2024

కామారెడ్డి: విరాళాలతో ప్లాట్ఫాం నిర్మించుకున్న గ్రామస్థులు

image

బిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామస్థులు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని చూడకుండా విరాళాలు పోగు చేసుకుని సొంతంగా 19 ఏళ్ల క్రితం రైల్వే ప్లాట్‌ఫాం నిర్మించుకున్నారు. ఒక్కొక్కరికీ రూ.25 చొప్పున జమచేసుకున్నారు. వివిధ సంఘాల నుంచి విరాళాలు స్వీకరించారు. అంతేగాక టికెట్లు ఇవ్వడంతో పాటు రైళ్ల సమాచారం తెలిపేందుకు తాత్కాలిక ఉద్యోగిని కూడా నియమించుకున్నారు. రైళ్లు ఆ ప్లాట్‌ఫాంపై ఆగేలా చేశారు.

Similar News

News September 12, 2024

బాన్సువాడలో కత్తులతో దాడి చేసుకున్న వ్యక్తులు

image

మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గొడవపడి కత్తులతో దాడి చేసుకున్న ఘటన బుధవారం రాత్రి బాన్సువాడలో జరిగింది. తాడ్కోల్ చౌరస్తాలోని ఓ బార్ వద్ద నడి రోడ్డుపై మద్యం మత్తులో సోనుసింగ్, సంజీవ్ మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సోనుసింగ్ తల్వార్‌తో సంజీవ్ పై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పోలీసులు చికిత్స కోసం నిజామాబాద్ తరలించి కేసు నమోదు చేశారు.

News September 12, 2024

రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు పిట్లం విద్యార్ధిని ఎంపిక

image

రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీలకు పిట్లం ZPHS విద్యార్ధిని మహాలక్ష్మి ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ సంజీవులు తెలిపారు. పాల్వంచలో ఈ నెల 9 న జరిగిన జిల్లాస్థాయి ఖో ఖో టోర్నమెంట్లో మహాలక్ష్మి ప్రతిభ కనబరిచింది. ఖమ్మంలో జిల్లా కల్లూరు మిని స్టేడియంలో ఈనెల 13 నుంచి 15 వరకు జరిగే ఖో ఖో సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఆమె ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు అభినందించారు.

News September 12, 2024

పొతంగల్: సీఎస్సీ నిర్వాహకురాలి ఇంటికి తాళం, వేలం

image

పొతంగల్ మండలం కల్లూరు గ్రామంలో కాజేసిన రూ.45 లక్షలు సకాలంలో చెల్లించక పోవడంతో కెనరా బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకురాలి ఇంటికి మహిళా సంఘాల సభ్యులు బుధవారం తాళం వేశారు. అనంతరం ఆ ఇంటిని వేలం వేయగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.14.80 లక్షలకు దక్కించుకున్నాడు. సదరు మహిళ నెల రోజుల్లో కాజేసిన సొమ్ము చెల్లిస్తానని బాండ్ రాసిచ్చి రూ.6 లక్షల చెల్లించి కాలయాపన చేస్తున్నట్లు సభ్యులు తెలిపారు.