News August 16, 2024
కామారెడ్డి: విష జ్వరంతో 4వ తరగతి విద్యార్థి మృతి
సదాశివనగర్ మండలం భూంపల్లిలో విషజ్వరంతో 4వ తరగతి చదువుతున్న ఊరడి రంజిత్(9) అనే బాలుడు మృతి చెందాడు. రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న రంజిత్‌ను గురువారం మధ్యాహ్నం గాంధారి ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. గ్రామంలో వారం రోజులుగా విష జ్వరాలతో చాలా మంది అస్వస్థతకు గురయ్యారని, గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News September 17, 2024
ఎల్లారెడ్డి: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
కామారెడ్డి జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకొంది. ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేటలో ప్రమదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుజ్జిగారి ఏశయ్య(25) స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని పటేల్ చెరువులో వినాయక నిమజ్జనానికి వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఈత రాక మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 17, 2024
కామారెడ్డిలో రికార్డు స్థాయి ధర పలికిన లడ్డూ
కామారెడ్డిలో వినాయకునికి లడ్డూ రికార్డు ధర పలికింది. కామారెడ్డి హౌసింగ్ బోర్డులోని సంకష్ఠ గణపతి దేవాలయంలో నిర్వాహకులు లడ్డూ వేలం పాట నిర్వహించారు. కాగా జీఆర్ఎల్ సంస్థ ప్రతినిధి సంతోష్ రూ.2.79 లక్షలకు లడ్డూను వేలం పాటలో దక్కించుకున్నారు.
News September 17, 2024
NZB: వినాయక నిమజ్జనం.. కావొద్దు విషాదం..!
వినాయక చవితి సందర్భంగా 11 రోజుల పాటు పూజలు అందుకున్న లంబోదరుడు రేపు గంగమ్మ ఒడిలోకి చేరనున్నాడు. అయితే వినాయకుడికి గంగమ్మ చెంతకు తీసుకెళ్లే క్రమంలో.. చిన్నపాటి నిర్లక్ష్యం భక్తుల ప్రాణాల మీదకు తెస్తోంది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రతీ ఏటా ఉమ్మడి NZB జిల్లాలో నిమజ్జనం సమయంలో అపశృతులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏటా వినాయక నిమజ్జనం విషాదం కాకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ..గణేష్ నిమజ్జనం చేద్దాం.